సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మొత్తం మీద చంద్రబాబు ఎలక్షన్ క్యాంపెయిన్‌లో చెప్పినట్లే.. కీలక మైన హామీ అమలులోకి రాబోతుంది. నాసిరకం బ్రాండ్ లతో విసిగిపోయిన మందు బాబుల కు ఇకపై ఎక్కడ చుసిన బ్రాండెడ్ లిక్కర్ ను అందుబాటులోకి వచ్చేలా, ఎక్కువ సమయం లిక్కర్ షాప్ లు తెరచి ఉంచేలా కొత్త ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొంటున్నట్లు సమాచారం. ఈనెల 12న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చెయ్యగానే.. మందుబాబులు పండుగ చేసుకోవడానికి ఇప్పటికే ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం. ఇకపై ఏపీలో నాన్ బ్రాండెడ్ లిక్కర్‌కు చెక్ పెడుతూ.. బ్రాండెడ్ లిక్కర్‌ను మళ్లీ అందుబాటులోకి తెచ్చినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా పాపులర్ అయిన.. కింగ్ ఫిషర్ బీర్లను కంటైనర్లలో తీసుకువచ్చి రాష్ట్ర వ్యాప్తంగా గోడౌన్‌లలో నిల్వ చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే కింగ్ ఫిషర్ బీర్లతో ఏపీకి వచ్చిన కంటైనర్ వీడియోను టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకట రమణారెడ్డి ట్వీట్ చేశారు. ‘ఇట్స్ బ్యాక్ ఆల్ ఓవర్ ఏపీ.. కింగ్ దిఫిషర్ చీర్స్’ అని ఆయన రాసుకొచ్చారు. ఆ వీడియో ప్రజంట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఆహా.. ఎంత మందు ప్రియులకు ఎంతటి శుభవార్త చెప్పారండి.. చెప్పారండీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు లిక్కర్ ప్రియులు.
