సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అలాగే అలాగే బడ్జెట్ ప్రతులను నేటి ఉదయం స్వయంగా వెళ్లి శాసనమండలి చైర్మెన్ మోషేను రాజు ఛాంబర్ కు వెళ్లి అందజేశారు( ఫై చిత్రంలో). శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తదుపరి శాసన మండలిలో మంత్రి నారాయణ వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. మొత్తం రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌ను తయారు చెయ్యగా. ఇందులో శాసన మండలి లో ప్రవేశపెట్టిన వ్యవసాయానికి రూ.48,340 కోట్లు, వయబులిటీ గ్యాఫ్ ఫండ్ రూ.2 వేల కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. అలాగే ఎస్సీల గృహ నిర్మాణానికి రూ.50 వేలు, ఎస్టీల గృహ నిర్మాణానికి రూ.70 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు ఎన్టీఆర్ వైద్య భరోసాకు రూ.31,613 కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి తెలిపారు
