సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇకపై ఆంధ్ర ప్రదేశ్ లో సబ్‌ రిజిష్టర్ కార్యాలయాలు ఇక నుంచి ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండేలా ఆఫీసులలో కొత్త సంప్రదాయాల తో తాజగామెమో జారీ అయ్యింది. ఖజానాకు వేలకోట్ల ఆదాయం సమకూర్చుతున్న వారికి తగిన గౌరవ మర్యాదలు దక్కాలని ఆ మెమోలో పేర్కొన్నారు. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ కూర్చునే కుర్చీ ఎత్తు తగ్గించడమే కాకుండా, వారి ముందుండే పోడియంను ఎత్తేయాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో సబ్‌రిజిస్ర్టార్‌ ముందు ఉండే పోడియం చెక్కతో ఉంటుంది. దాని చుట్టూ ఎరుపు రంగు వస్త్రం ఉంటుంది. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారు పోడియం ముందు నిలబడి ఉండే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. ఈ విధానం అమర్యాదరకరంగా ఉందని, ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అంతరం పెంచేలా ఉందని రెవెన్యూ, రిజిస్ర్టేషన్ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా అభిప్రాయపడ్డారు. ఇకపై సబ్ రిజిస్టర్ టేబుల్ ముందు కుర్చీలు ఏర్పాటు చేసి వచ్చినవారికి కూర్చునే అవకాశం తో పాటు వేచి ఉండేవారికి మంచినీరు, వీలయితే కాఫీ లు కూడా అందివ్వాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *