సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తణుకు పట్టణం, గత మంగళవారం రాత్రి నెక్కా కళ్యాణ మండపంఆవరణలో జరిగిన తణుకు నియోజకవర్గ బిసిల ఆత్మీయ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మరియు నరసాపురం పార్లిమెంట్ అభ్యర్ధి గూడూరి ఉమాబాల, రాష్ట్ర మంత్రివర్యులు తణుకు ఎమ్మెల్యే అభ్యర్ధి డా, కారుమూరి వెంకట నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, డిసిఎంఎస్ ఛైర్మెన్ వెండ్ర వెంకట స్వామి, మరియు వివిధ హోదా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మహిళలు,కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వై యస్ జగన్ ప్రభుత్వమే బీసీ లకు అన్ని రంగాలలో పెద్ద పీట వేసిందని ఈ అంశం చరిత్ర గుర్తుండిపోతుందని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికలలో కీలక నియోజకవర్గాలు అన్ని బీసీ లకే కేటాయించిన ఘనత వైసీపీ అధినేత సీఎం జగన్ కే దక్కుతున్నారు..ఇప్పటి వరకు ఇతర పార్టీల నేతలు తెలుగు రాష్ట్రాలలో బిసిలకు ఇంతటి ప్రాధాన్యత ఇవ్వలేదని తనను రాజ్యసభ సభ్యునిగా చేసి కేంద్రంలో పెద్దల సభకు పంపిన ఘనత కూడా సీఎం జగన్ కే దక్కుతుందని, బీసీ నేతలు స్థానిక మంత్రి, ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి నాగేశ్వర రావు ను మరియు ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ఆర్ కృష్ణయ్య పిలుపు నిచ్చారు. లో గత మంగళవారం సాయంత్రం భీమవరం నియోజకవర్గం, వీరవాసరం మండలంలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పార్లమెంట్ అభ్యర్థిని గూడూరి ఉమాబాల మరియు భీమవరం నియోజకవర్గం అభ్యర్థి శ్రీ గ్రంధి శ్రీనివాస్ తో కలసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
