సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విద్యార్థులు మరింత కష్టపడి చదివి భవిష్యత్తులో అద్భుతమైన ఉపాధ్యాయులుగా రాణించేందుకు డిఎస్సీ ఉచిత శిక్షణ తరగతులు సువర్ణ అవకాశమని,విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం లో నేడు, శనివారం జిటిపి మహిళ కళాశాలలో వెనుకబడిన తరగతుల అధ్యయన కేంద్రం వారిచే ఏర్పాటు చేసిన మెగా డిఎస్సీ ఉచిత శిక్షణ తరగతులను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి సంతకం చేసింది మెగా డిఎస్సీ మీదనే అని, విద్యకు ప్రాధాన్యత ఇస్తే ఉజ్వల భవిష్యత్ మీదే అని, మీరు చదువుకుంటే మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత మాదే అని, గ్రంథాలయాలను పుస్తకాలను అధ్యయనం చేయాలని అన్నారు. డిఎస్సికి అందిస్తున్న ఉచిత శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేజీఆర్ఎల్ కళాశాల కార్యదర్శి మెంటే మనోహర్, జాయింట్ సెక్రటరీ అరేటీ ప్రకాష్, కోశాధికారి గన్నాబత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 46 మంది శిక్షణ పొందుతున్నారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన శిక్షణ తరగతుల అధికారి జివీఆర్ఎస్ గణపతి రావు, కారుమూరి సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
