సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (EVMs) స్థానే తిరిగి పాత పద్ధతిలో బ్యాలెట్ పేపర్ ఓటింగ్‌ను తీసుకురావాలంటూ ఏపీలో వైసీపీ అధినేత జగన్ తో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్, శివసేన థాకరే , సమాజ్ వాదీ లాంటి కీలక పార్టీలు కేంద్రం ఫై వత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే.. అయితే వీరందరికన్నా ఘనుడు మన తెలుగువాడు ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ (KA Paul) దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు నేడు, మంగళవారంనాడు కొట్టివేసింది. ”మీరు గెలిస్తే ఈవీఎంలు మంచివి, ఈవీఎంలు ట్యాంపర్ కాలేదని అంటారు. ఓడిపోతే మాత్రం ఈవీఎంల ట్యాపరింగ్ జరిగిందని అంటారు” అని న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, పీబీ వరలేతో కూడిన ధర్మాసనం కే ఏ పాల్ ను నిలదీసింది. బ్యాలెట్ పేపర్ల విధానాన్ని తిరిగి తీసుకురావాలని, ఓటర్లకు డబ్బులు, మద్యం పంచినట్టు తేలిన అభ్యర్థులపై అనర్హత వేటు వేయాలని, కేఏ పాల్ కోర్టుకు తాన వాదన వినిపించారు. పలు విదేశాల్లో ఇప్పటికీ బ్యాలెట్ ఓటింగ్ విధానాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు.. మిగతా ప్రపంచంలో బ్యాలెట్ ఓటింగ్ జరుగుతున్నంత మాత్రాన మీరెందుకు భిన్నంగా ఉండాలని కోరుకోవడం లేదు? అని సుప్రీం కోర్ట్ అడిగింది. పిటిషన్‌ను కొట్టివేసింది.
