సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతంలో జగన్ సర్కార్ ప్రభుత్వ ఉద్యొగులకు జీపీఎస్ (GPS) అమలు తేదీని మరోసారి నిర్ధారిస్తూ అదే బాటలో..ఇటీవల కొత్త కూటమి ప్రభుత్వం మరోసారి విడుదలయిన ఉత్తర్వులు, గెజిట్ నోటిపికేషన్ నేపథ్యంలో.. బిత్తరబోయిన ప్రభుత్వ ఉద్యొగులు మరల ఆందోళనలు మొదలు పెట్టడంతో వాటిని నిలుపుదల చేస్తూ సీఎం చంద్రబాబు నేడు, మంగళవారం నిర్ణయం తీసుకొన్నారు. దీనితో సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు. గతంలో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత జీపీఎస్ తీసుకొచ్చారన్నారు. సీపీఎస్ ఉద్యోగులతో పాటు అందరూ దానిని వ్యతిరేకించామని, ఉద్యోగుల అభిప్రాయాలు తీసుకోకుండా బలవంతంగా జీపీఎస్‌ను జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ జీవోను కొంతమంది అధికారులు ఇటీవల మరోసారి సీఎం ఆదేశాలు లేకుండానే? బయటపెట్టారని, పాత ప్రభుత్వం తాలూకా ప్రభావం ఇంకా కొందరు ఫై అధికారుల స్వంత నిర్ణయంగా భావించే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొనివెళ్ళగానే ఆయన దానిని నిలుపుదల చేసారని కొందరు ఉద్యోగ సంఘ నేతలు వ్యాఖ్యానించారు.
