సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక ప్రక్క అమెరికా సుంకాలు మోత మరోప్రక్క బీహార్ ఎన్నికల వేళా భవిషత్తు పరిణామాలు బేరీజు వేసుకొని ఎట్టకేలకు ఇంతకాలం జీఎస్టీ సంస్కరణలుపేరిట సామాన్య ప్రజలను, చిన్న వ్యాపారులను బాదిన బాదుడు ను కాస్త తగ్గించినట్లు కేంద్రం ప్రకటించింది. దీనితో దేశీయ సూచీలకు మంచి బూస్టింగ్ వచ్చింది. . జీఎస్టీ నూతన సంస్కరణలు తో భారత్ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. గత శుక్రవారం ముగింపు (80, 710)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 200 పాయింట్ల లాభాలతో మొదలైన సెన్సెక్స్ ఆ ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. ఒక దశలో దాదాపు 400 పాయింట్లు లాభపడి 81 వేల మార్క్‌ను కూడా క్రాస్ చేసింది. ప్రస్తుతం ఉదయం 10:30 గంటల సమయంలో సెన్సెక్స్ 102 పాయింట్ల లాభంతో 80, 813 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ 42 పాయింట్ల లాభంతో 24, 783 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 377 పాయింట్ల లాభంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.27గా ఉంది.
