సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏలూరు జిల్లాలో ఉన్న నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఎగ్జామ్ హాల్లోకి అనుమతించలేదని ఆగ్రహించిన ఒక విద్యార్థి అధ్యాపకుడిపై దాడి చేసాడు. వివరాల్లోకి వెళ్తే..నేడు సోమవారం ఉదయం ఎంటెక్ విద్యార్థి వినయ్ పరీక్ష రాయడానికి హాజరయ్యాడు. అయితే, అధ్యాపకుడు గోపాల్‌రాజు విద్యార్థి వినయ్‌ను ఎదో కారణంతో ఎగ్జామ్ హాల్లోకి అనుమతించలేదు. దీనిపై ఆగ్రహించిన వినయ్, ఫ్యాకల్టీ సభ్యుడుగోపాల్‌రాజును కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. ఆ తర్వాత వెంటనే హాస్టల్‌లోకి పారిపోయాడు. వెంటనే అప్రమత్తమై విద్యార్ధులు గాయపడిన అధ్యాపకుడిని హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ ఘటనతో క్యాంపస్‌లో ఆందోళన వాతావరణం నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దాడి చేసిన విద్యార్థిపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రిపుల్ ఐటీ అధికారులు ప్రకటించారు.
