సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్రీకాకుళం లో జరిగిన వైసీపీ పార్టీ సమావేశంలో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది కొత్త అమావాస్య (ఎన్నికల తరువాత అని ఉద్దేశ్యం.. ) తర్వాత తెలుగుదేశం,జనసేన పార్టీలు ఉండవని.. ఉంటే తాను గుండుకొట్టించుకుంటానని సవాల్ చేసారు. ఇదేదో గొప్ప కోసం.. ఆవేశంతో చెప్పడం లేదని, తనకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవంతో చెబుతున్నానన్నారు. ప్రజలనాడి తెలిసిన వ్యక్తిగానే ఈ ప్రకటన చేస్తున్నానని తెలిపారు. టీడీపీ, జనసేన కు ఎంతసేపు జగన్ ను అధికారంలో నుండి దించేసి వాళ్ళు ఎక్కాలని యావ తప్ప చిత్తశుద్ధి లేదని వారి చేష్టలతో ప్రజలు గమనించారని చిత్తశుద్ధి ఉంటే, ప్రజలకు మేలు చేయాలనే సంకల్పం ఉంటే పార్టీలు ఉంటాయి. ఏది ఏమైనా నా అంచనా నిజమై తీరుతుంది అన్నారు.
