సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు దేశం , జనసేన ఫస్ట్ లిస్ట్ లో పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ కి చెందిన 4 సీట్లు అభ్యర్థులను ప్రకటించారు తప్ప, భీమవరం లో పవన్ కళ్యాణ్ పోటీచేస్తునట్లు కానీ నరసాపురం, తాడేపల్లి గూడెం సీట్లు జనసేన కు కేటాయిస్తున్నట్లు కానీ ప్రకటన రాకపోవడం జిల్లాలో జనసేన ను నివ్వెరపరచింది. అసలే ఇరు పార్టీల అధినేతలతో తాడేపల్లి గూడెంలో 6 లక్షల మందితో భారీ సభ అని ప్రకటించారు. కనీసం తాడేపల్లి గూడెం అయిన జనసేన అభ్యర్థి గా ప్రస్తుత పార్టీ ఇంచార్జి బొలిశెట్టి శ్రీనివాస్ పేరు ప్రకటించకపోవడం విడ్డురంగా ఉంది. లేనిపోని అపోహలకు దారి తీస్తుంది. ఇది బహిరంగ సభ ఫై కూడా ప్రభావం చూపే అవకాశం స్వష్టంగా ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సీట్ల మొదటి లిస్టు విడుదలయ్యాక ఇరు పార్టీల నేతలలో చాల ప్రాంతాలలో అసమ్మతి సెగలు బహిరంగంగానే రగిలిపోతున్న నేపథ్యంలో ఇంకెందుకు నాన్చుడు ? తాడేపల్లి గూడెం లో ఇప్పటికే జనసేన టీడీపీ పార్టీలు ఎవరి దారిలో వారు బహిరంగ సభకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు, ఇప్పడు ఇంకా సీటు జనసేన కు కేటాయించకపోవడం టీడీపీ ఇన్చార్జి వలవల బాబ్జి మద్దతు దారులలో కొత్తగా ఆశలు చిగురించాయి. అనూహ్యంగా బీజేపీ తో పొత్తు ఖరారు అయితే వారికీ టీపీ గూడెం సీటు ఇవ్వాలా ? మరో ప్రక్క నరసాపురం సీటులో జనసేన పార్టీ కి జవసత్వాలు ఇచ్చిన బొమ్మిడి నాయకర్ స్థానంలో కొత్త పల్లి సుబ్బారాయుడు కి సిటు మారుస్తారని కొత్త టాక్ మొదలయింది. ఎంతకాదన్న టీడీపీ లో ఎక్కువ కాలం కొత్తపల్లి సుబ్బారాయుడు పలు పదవులు అనుభవించిన చరిత్ర ఉంది. ఆయన ప్రస్తుతం ఉన్న వైసీపీ నుండి జనసేన లోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.. ఒక ప్యూహం ప్రకారం సీట్లలో అభ్యర్థులు మార్చేందుకే జనసేన అభ్యర్థులను పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రకటించలేదా ? అసలేం జరుగుతుంది.? తాడేపల్లి గూడెం సభ కు పశ్చిమ గోదావరి జిల్లాలోని టీడీపీ జనసేన క్యాడర్ సంయుక్తంగా సమర్ధవంతంగా పనిచేస్తుందా? ఈ పరిస్థితులలో..
