సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పేందుకు సిద్ధంగా ఉంది. తాజా సమాచారం ప్రకారం వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే కరువు భత్యాన్ని (డీఏ)ని కేంద్రం 4శాతం పెంచే అవకాశం ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చా యి. ఈ పెంపు తర్వాత డియర్ నెస్ అలవెన్స్ , డియర్ నెస్ రిలీఫ్ (డీఆర్) 50 శాతానికి పైగా పెరగనుంది. చివరి సారిగా 2023 అక్టోబర్ లో కేంద్రం డీఏని 4 శాతం పెంచింది. ఆ నాలుగు శాతం పెంపుతో డీఏ 42 శాతం నుంచి 46 శాతానికి పెరిగింది. తాజా నిర్ణయం తో 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యో గులు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *