సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏలూరు జిల్లా ఇటీవల కాలంలో టీడీపీ నుండి వైసీపీ లో చేరిన కైకలూరు మాజీ ఎమ్మెల్యే, జయమంగళ వెంకట రమణ అనూహ్య పరిణామాల మధ్య గత రాత్రి ఎమ్మెల్సీ గా గెలుపొందారు. గురువారం జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపులో వైసీపీ నుంచి బరిలోదిగిన కోలా గురువులు, జయమంగళకు సమాన ఓట్లు వచ్చా యి. రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించడంతో జయమంగళ కు అందులో ఎక్కువ మద్దతు రావడంతో ఎమ్మెల్సీ గా విజయం వరించింది. దీంతో కైకలూరు నియోజకవర్గం వ్యాప్తంగా వైసిపి అభిమానులు , ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మత్యకారుల సంఘాలు వారు నేడు, శుక్రవారం సంబరాలు చేసుకొంటున్నారు. ఈ గెలుపు నేపథ్యంలో.. జయమంగళ మాట్లాడుతూ.. సీఎం జగన్ కు రుణపడి ఉంటానని. కొల్లేరు అభివృద్ధికి కృషి చేస్తానని, రాష్ట్రంలో మత్యకారుల అభివృద్ధికి కృషి చేసి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు పాటు పడతానని పింఛనుతో పాటు గతంలో మాదిరిగా రాయితీపై వెదురు కర్రలు, తాటిదోనెలు, వలలు అందించేలా సీఎం జగన్తో చర్చించి మత్స్యకారులకు అండగా ఉంటానన్నారు.
