సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:గత ఆదివారం రాత్రి జరిగిన బాలకృష్ణ తాజా చిత్రం ‘. ‘వీరసింహుని విజయోత్సవం’ పేరుతో నిర్వహించిన ఈ వేడుకలో బాలకృష్ణ దూకుడుగా స్వర్గీయ ఎస్ వి రంగారావు, అక్కినేని నాగేశ్వరరావు ల గురించి మాట్లాడిన మాటలు వివాదానికి తెరలేపాయి. .. బాలయ్య సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లను అభినందించారు. ఈ క్రమంలో వేదికపై ఉన్న జయరాం అనే ఆర్టిస్ట్‌ గురించి చెబుతూ, ‘‘ఇక ఈయన ఉన్నారంటే సెట్‌లో నాన్నగారి డైలాగులు, ఆ.. రంగారావు, ఈ అక్కినేని, తొక్కినేని గురించి అన్నీ మాట్లాడుకుంటుండే వాళ్లం’’ అనేశారు. అయితే ‘అక్కినేని.. తొక్కినేని’ అనగానే అది ఎవరి గురించి అన్నారో అర్థం చేసుకుని సభలో ఉన్నవారంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అయితే బాలకృష్ణ ఆ విషయం సీరియస్ గా తీసుకోలేదు.. కానీ, ఆ వీడియోలు బాగా వైరల్ అయ్యాక..అది బాలకృష్ణ కు మిగతా నటులపై ఉన్న చిన్నచూపు అంటూ , అహంకారం అంటూ సోషల్‌ మీడియాలో మాత్రం దీని గురించి రచ్చ మొదలైంది. బాలకృష్ణ మాట్లాడిన వీడియోను పోస్ట్‌ చేసి, రకరకాల కామెంట్లతో నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *