సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో దశాబ్దాలుగా దసరా పండుగ పూర్తీ అయ్యాక మేళతాళాలతో 8 అడుగుల ఎత్తులో తయారు చేసిన భారీ తెల్ల ఏనుగు సంబరం ఊరేగింపు కు పట్టణంలో ఒక విశిష్ట స్తానం ఉంది. స్థానిక కోర్టులో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గత 1920 సంవత్సరం నుండి విజయదశమి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. రేపు శనివారం (ఈనెల 11వ తేదీ న) సాయంకాలం 6 గంటలకు పట్టణంలో ఏనుగు సంబరాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. . భీమవరం శ్రీమావుళ్లమ్మ ఆలయ సమీపంలో గల పురాతన శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయంలో వద్దనుండి ఏనుగు సంబరం ప్రారంభం అవుతుంది.
