సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం భీమవరం పట్టణానికి 11 కిమీ దూరంలో 450 ఏళ్ళ క్రితం స్వయం భువుడుగా వెలసిన కాళ్ళకూరు గ్రామం లో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా నేటి శుక్రవారం మద్యాహ్నం ఎర్రటి ఎండలో సైతం స్వామివారి సుమారు 30 అడుగుల రథోత్సవం వైభవంగా సాగింది. వేద మంత్రాల నడుమ పలు మేళతాళలతో సుందరంగా అలంకరించిన రథంపై స్వామివారు దేవేరులతో కలసి ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు.కార్యక్రమంలో ఏర్పాటు చేసిన బుట్ట బొమ్మలు, శక్తి వేషాలు, తీన్మార్ డప్పులు, మేళతాళాలు, డీజే సిస్టం భక్తులను ఉత్సహపరిచాయి.. రథోత్సవంలో పాల్గొన్న భక్తులు రథాన్ని లాగేందుకు గోవిందా.. గోవిందా.. అంటూ పోటీపడటంతో వీధులన్నీ ఉమ్మడి పశ్చిమ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో కాళ్ళకూరులో దారులన్నీ కిక్కిరిసిపోయాయి.కాళ్ల పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. కార్యనిర్వహణాధికారి మోకా .అరుణ్‌కుమార్, ధర్మకర్తలు, ఏర్పాట్లను పర్యవేక్షించారు.మే 3 ఎల్లుండి ఆదివారం తో వేడుకలు ముగుస్తాయి. అయితే మే 9వ తేదీన శ్రీ స్వామివారి తోటలో భక్తులకు అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేసారు
