సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మానవతా సేవ ద్వారా సమాజాలను బలోపేతం చేయవచ్చునని లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు లయన్ వబిలిశెట్టి కనకరాజు, భీమవరం లయన్స్ క్లబ్ అడ్జక్షులు బొండా రాంబాబు, అన్నారు. భీమవరం కిషోర్ థియేటర్ రోడ్డులోని భవిత స్కూల్లో (మానసిక.. స్కూల్) బుధవారం ‘ఇంటర్నేషనల్ లయన్స్ డే’, వబిలిశెట్టి కనకరాజు పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. స్కూల్ కు స్టీల్ కంచాలు, గ్లాస్ లు, బిస్కెట్స్, చాక్లెట్స్ , పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రపంచ వ్యాప్తంగా 200కు పైగా దేశాలలో సామాజిక సేవలు అందిస్తుందని అన్నారు. సమాజ సేవ, నాయకత్వం, సంక్షేమ కార్యక్రమాలకు లయన్స్ క్లబ్ అంకితమైయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు అల్లు తులసి ప్రసాద్, కనగర్ల విజయ రామకృష్ణ, పి. శ్యామ్ సుందర్, నందమూరి రాజేష్, హెడ్ మాస్టర్ పి. శ్రీనివాసరావు, స్కూల్ సిబ్బంది మరియు విద్యార్థుల పాల్గొన్నారు.
