సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అంగన్వాడి టీచర్స్ కు మరియు ఆయాలకు యూనిఫామ్ చీరలను ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు భీమవరం పట్టణ శివారు పెదమిరం లో తన క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. ఉండి నియోజకవర్గానికి సంబంధించి నాలుగు మండలాలకు చెందిన 261 మంది అంగన్వాడీ టీచర్స్ కు ఒక్కొక్కరికి రెండు చీరలు చొప్పున 522 యూనిఫామ్ చీరలను, 245 మంది ఆయాలకు ఒక్కొక్కరికి రెండు చీరలు చొప్పున 490 యూనిఫాం చీరలను రఘురామ అందజేశారు. ప్రస్తుతం అంగన్వాడి కేంద్రాలలో చిన్నారులకు ఉన్న మౌలిక వసతులు గురించి ఐసిడిఎస్ వాణి విజయ్ రత్నం ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్, ఆయాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
