సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారు ఆషాడ పౌర్ణమి సందర్భముగా నేడు, బుధవారం ప్రజలు కు ఆయురారోగ్యాలు ప్రసాదించే పచ్చని పకృతి దేవత శాఖంబరి దేవిగా అలంకరణ లో దర్శనమిచ్చారు. దేవాలయంలో ఉప దేవాలయం శ్రీ వినాయక విగ్రహం ఉపాలయం మొదలుకొని శ్రీ అమ్మవారి దేవాలయం లో నలువీధుల ఎంతో శ్రమకు ఓర్చి ఎన్నో టన్నుల కూరగాయలు ఆకూ కూరలతో పండ్ల తో విభిన్న పుష్పాలతో చేసిన అలంకరణ నభూతో నభవిషత్ అన్న రీతిలో అలంకరించారు. ఇక పండ్లు పుష్పాలతో నిలువెత్తు శ్రీ అమ్మవారు అయితే వనదేవత ను తలపించారు. తన భక్తులకు గృహాలలో ఏ లోటు లేకుండా సకల సుఖశాంతులు అందించే శాఖంబరి దేవిని వేలాదిగా భక్తులు విశేషంగా కుటుంబ సమేతంగా దర్శించుకొంటున్నారు. అందమైన అడవిని తలపించేలా తీర్చిద్దిన అలంకరణలతో ఉన్న ఆలయంలో విహరించడం ఒక ఆధ్యాత్మిక మధురానుభూతి ని మిగులుస్తుంది. నేటి ఉదయం పండితులు చండి హోమం ఘనంగా నిర్వహించారు.
