సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇప్పటికి తెలుగులో ఇండస్ట్రీ హిట్స్ కొట్టగల సీనియర్ హీరోగా వెంకటేష్ క్రెజ్ మాములుగా లేదు.. అలాగే మల్టి స్టార్ సినిమాలు కు ‘సై’ అనే వెంకటేష్ ఇప్పుడు తమిళనాట కోలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘డేర్ డెవిల్’ చిత్రంలో వెంకటేష్ ఒక అత్యంత కీలకమైన పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని ఈ మధ్యనే మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో పాటు టైటిల్ ని కూడా అనౌన్స్ చేశారు. వచ్చే సెప్టెంబర్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. వెంకీ మామ ఈ సినిమాలోకీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలియడంతో ఒక్కసారిగా డేర్ డెవిల్ పై అంచనాలు పెరిగిపోయాయి. తెలుగు వాడయి కూడా తమిళ్ సినిమాలలో సూపర్ హీరో అయిన అజిత్‌తో ఉన్న ప్రత్యేక అనుబంధం, స్నేహం కారణంగానే వెంకీ ఈ ఆఫర్‌కు సుముఖత వ్యక్తం చేశారని మరోవైపు ఈ సినిమాలో ఆయన కోసం డిజైన్ చేసిన పాత్ర ఎంతో బలంగా ఉండటమే అసలు కారణమని అంటున్నారు.
