సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఏపీ, తెలంగాణ క్షత్రియ సేవాసమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు ఆదివారం ఫిల్మ్ నగర్‌లోని ఎఫ్‌ఎన్‌సీసీలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలుగు సినీ చరిత్రలోనే కాదు భారతదేశ సినీ చరిత్రలో ఎన్నో అద్భుతాలు చేసిన లెజెండరీ , మంచి మనిషి, సినీ హీరో సూపర్ స్టార్ కృష్ణ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ రఘురామకృష్ణ రాజు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అశ్వినీదత్, తమ్మారెడ్డి భరద్వాజ, పాతపాటి సర్రాజు క్షత్రియ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు చిత్రం నిర్మాణంలో తాను కష్టపడ్డానని, ఆ సినిమాకు కృష్ణ దగ్గర రూ. 300లకే అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశానని మోహన్ బాబు అన్నారు. అల్లూరి విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేసేలా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కృషి చేయాలని కోరారు.టాలీవుడ్‌లో డేరింగ్, డేషింగ్ అనే పదాలకు ఏకైక నిర్వచనంగా నిలిచిన హీరో కృష్ణ. అల్లూరి సీతారామరాజు పాత్రలో కూడా చిరస్థాయిగా నిలిచిపోయిన కృష్ణకు మహా సన్మానం ను నిర్వహించారు. గజమాలతో సాళువ, అల్లూరి స్వర్ణ జ్ఞాపిక, నిలువెత్తు కృష్ణ రూపంలో అల్లూరి చిత్ర పటం ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. తాను 350 సినిమాల్లో నటించినా.. ‘అల్లూరి సీతారామరాజు’ సినిమానే తనకి ఇష్టమని.. ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాను ఎన్టీఆర్ ఎప్పుడు తీస్తారోనని ఆసక్తిగా చూసేవాడినని, తన వందో చిత్రంగా తనే అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని నిర్మించానని తెలిపారు. బుర్ర కథల ద్వారా చిన్నప్పుడు సీతారామరాజు జీవితం గురించి తెలుసుకున్నానని, పది పన్నెండేళ్ళ వయస్సులోనే సీతారామరాజు సినిమా తీయాలని నిర్ణయించుకున్నానని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *