సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇరాన్ కు అమెరికా ఇజ్రాయిల్ కు మధ్య చర్చలకు పాకిస్తాన్ మధ్యవర్తితం వహిస్తుందని పాక్ హడావిడి చేస్తున్న, నిజానికి వాళ్ళ మధ్య యుద్ధం ముగింపుకు చర్చల ద్వారా భారత్ వెనుకనుండి చేయదగ్గ సాయం చేస్తుందని, ఇప్పటికే గాయపడిన ఇరాన్ ప్రజలను భారీ మందులు పంపిణీతో ఆదుకొంటుందని, ప్రపంచ మీడియా పేర్కొంటున్న వేళా. నేడు, శుక్రవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మోదీకి ఫోన్ చేసిన ట్రంప్.. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న దాడుల వల్ల ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి ( Hormuz) మూతపడటంపై …దీనికి త్వరితంగా పరిష్కార మార్గం వెతకాలి అని చర్చించుకొన్నారు. ఈ సందర్భంగా మోదీ పనితీరును ప్రశంసిస్తూ.. ట్రంప్ తాజగా ఒక ప్రకటన విడుదల చేశారు.. ప్రధాని మోదీ, నేను.. పనులు పూర్తి చేసి చూపించే వ్యక్తులం. ఇది చాలా తక్కువ మంది విషయంలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది’ అంటూ ప్రధాని మోదీ నాయకత్వ పటిమను కొనియాడారు. ( up file photo)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *