సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాపు జాతి కోసం, రైతుల కోసం, మధ్య తరగతి ప్రజలు కోసం రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ నియంతృత్వ చర్యలను, అధినేతలను ఎదిరించి తన పంతాన్ని అనేకసార్లు గెలిపించుకొన్న నిత్యా పోరాట యోధుడు ముద్రగడ పద్మనాభం ఇక అలసిపోయి తనువు చాలించారు.కాన్సర్ తో పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం గత మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.ప్రభుత్వ లాంఛనాలతో జరగవలసిన అంత్యక్రియలను ఆయన కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఆయనను చివరి రోజులలో మానసికంగా దెబ్బతీసిన కూతురు క్రాంతి ని ఆఖరి చూపు చూడడానికి కూడా అడ్డుకొన్నారు. పత్తిపాడు నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్, కాంగ్రెస్ టీడీపీ అభ్యర్థిగా 4సారులు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, ఒకసారి కాకినాడ లోక్ సభ నుండి బీజేపీ టీడీపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ,ఎంపీగా గెలిచిన రాజకీయ ఉద్దండుడు.తరువాత కాలం కలిసిరాలేదు..చివరి రోజులలో వైసీపీ కీలక నేతగా కొనసాగారు. కాపు జాతి కోసం తన రాజకీయ భవిషత్తును పణంగా పెట్టి రాజకీయ ఓటమి స్వీకరించిన ధీరుడు. కాపులను బీసీల్లో చేర్చాలంటూ ముద్రగడ ఏడుసార్లు, రైతుల కోసం ఒకసారి, కరెంట్ బిల్లుకు నిరసనగా ఒకసారి ఆమరణ నిరాహార దీక్షలు చేసి అప్పటి ప్రభుత్వాలను గడగడ లాడించారు.. 2016లో తుని వేదికగా కాపు ఐక్య గర్జన సభ జరిగింది. ఈ సందర్భంగా అక్కడ చోటుచేసుకున్న రైలు దహనం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.ఎన్నో అరెస్టులు జరిగాయి. ఆయన ఇంటిపై పోలీసులు దాడి చేసి అరెస్టు చేసిన తీరు దారుణం అంటూ దాసరి నారాయణరావు. అంబటి రాంబాబు, చిరంజీవి, మోహన్ బాబు హైదరాబాద్ నుండి కిర్లంపూడి లో ఆయన నివాసానికి వచ్చి సంఘీభావం సంచలనమ్ రేపింది.. సమాజం ఏమనుకుంటుంది అనేదాని కంటే, తన మనస్సాక్షికి ఏది సరైనది అనిపిస్తే అది చేయడమే ముద్రగడ పద్మనాభం శైలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *