సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ నుండి వేలాది కోట్ల ఆక్వా ఎగుమతులకు రాజధానిగా పేరున్న భీమవరంలో రాష్ట్ర ఆక్వా రైతుల సమస్యలుతో సమావేశం అయ్యి ఇక్కడ బహిరంగ సభ నిర్వహించడానికి.. వచ్చిన మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ఎక్కడ చుసిన వేలాది జనంతో స్వగతం లభించడం పట్ల ఫిదా అయ్యిపోయారు. ఉండి రోడ్డు లోని వేదిక పైకి చేరుకొనివైసీపీ అభిమానులకు రైతులకు అభివాదం చేసి ప్రసంగం ప్రారంభించారు. . రాష్ట్రంలో కూటమి పాలనలో ఆక్వా తో పాటు వ్యవసాయ రైతాంగం అధోగతి పాలయింది అని విమర్శించారు. తన హయాంలో కొనసాగిన రైతు పధకాలు అన్ని.. రైతు భరోసా తో సహా బోగస్ పథకాలుగా మార్చేశారని ఆరోపించారు. నా హయాంలో ఆక్వా రైతులకు ఎన్నో సబ్సిడీలు ఇచ్చి ఆదుకొన్నను. నేనే రాష్ట్ర ఆక్వా కమిటీ కి చైర్మెన్ గా వ్యవహరించాను. రైతులను దోచేసే సిండీకేట్ లను అదుపులో పెట్టాను విద్యుతు యూనిట్ ధర రూపాయి న్నర కె రైతులకు అందించాను. .3న్నర వేళా కోట్ల విద్యుత్తూ సబ్సిడీ అందించాము. కరోనా సమయంలో కూడా ఆక్వా ఎగుమతులకు అండగా ఉన్నాను.. దేశంలో ఏపీ నెంబరు 1 ఆక్వా ఎగుమతుల రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వంతో వరుసగా అవార్డ్స్ సాధించాము . మరి కూటమి ప్రభుత్వం వచ్చాక ఏమి జరుగుతుంది. ఆక్వా, పొగాకు, మిర్చి అన్ని సిండికేట్ వ్యవహారాలే.. టీడీపీ పెద్దలే వారితో జోడి కట్టి మెతలు , సీడ్స్, అమ్మకాలు కొనుగోళ్లు లో రేట్లు నిర్ణయిస్తూ రైతులను లూటీ చేస్తున్నారు. .. మీ కష్టాలు నేను విన్నాను .. నేను ఉన్నాను.. మరో ఏడాది ఆగితే 3 ఏళ్ళ ప్రభుత్వం పూర్తీ అయిపోతుంది. నేను వస్తా.. రైతులను దోచేస్తున్న ఈ సిండికెట్లకు కూకటివేళ్లతో పెకిలించేస్తా! అంటూ జగన్ భరోసా ఇచ్చారు.
