సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. వైసీపీ ఫై దాడులను ఖండించడానికి వేదికగా వాడుకోవాలని, నల్ల కండువాలు కప్పుకొని 36 మంది ఎమ్మెల్సీ లు 11 మంది ఎమ్మెల్యేలతో.. గవర్నర్ ప్రసంగానికి శాసన సభ తోలి సమావేశాలకు హాజరయి.. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాల తో ప్లై కార్డ్స్ తో జగన్ అక్కడకు రావడం పోలీసులు అభ్యన్తరం వ్యక్తం చెయ్యడం జగన్ వారిపై ఆగ్రహం ప్రదర్శించిన దరిమిలా.. ఈ క్రమంలోనే అసెంబ్లీ హాల్‌ లో ఎవరు ఊహించని సన్నివేశం కనపడింది. అసెంబ్లీ హాల్‌లో వైసీపీ అధినేత జగన్‌ దగ్గరకు టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు వెళ్లి మాట్లాడటం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కనిపించిన వెంటనే హాయ్ జగన్ అంటూ రఘురామ ఆయన వద్దకు ఎదురెళ్లి వెళ్లి మరీ పలకరించారు. ఇది జగన్‌కు కూడా ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించినప్పటికీ రఘురామాతన పాత స్నేహితుడు కాబ్బటి వెంటనే తేరుకొన్నారు. అసెంబ్లీ లో రఘురామా జగన్ తో ‘ప్రతిపక్షం లేకపోతే ఎలా ?రోజూ అసెంబ్లీకి రా జగన్’ అని కోరారు. ‘ ఆ.. వస్తాను…మీరే చూస్తరుగా’ అని జగన్ చెప్పారు. అసెంబ్లీకి ప్రతిరోజూ వస్తే బాగుంటుందని మరోసారి జగన్‌కు సూచించారు. జగన్ చేతిలో చెయ్యి వేసి మరీ రఘురామ కొద్దిసేపు మాట్లాడటం ఆసక్తిని రేకెత్తించింది. అంతటితో రఘురామ ఆగితే బాగానే ఉంటుంది. అటుగా వెళుతున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ను తనకు జగన్ పక్కనే సీటు వేయించాలని రఘురామ కోరారు. తప్పని సరిగా.. అంటూ లాబీల్లో నవ్వుకుంటూ కేశవ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మొత్తానికి రఘురామా రాజకీయమా ? పాత స్నేహమో ?గత 4న్నర ఏళ్లుగా వైసీపీ ఎంపీ గా రెబల్ గా ఎంతో పోరాడి, జగన్ ఫై సైతం కేసులు పెట్టి టీడీపీ లో చేరిన తన స్థాయికి తగిన సరియైన గౌరవం దక్కలేదన్న అసహనమో ?అంతరార్ధము ఆయనకే తెలియాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *