సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నేడు, సోమవారం ఆకివీడులోని ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో ఆకివీడు మున్సిపాలిటీ ఛైర్మన్, మరియు కౌన్సిలర్ స్థానాలకు కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు, ఆయన కుమారుడు భరత్ తో కల్సి బి-ఫారాలను అందజేశారు. వారి విజయానికి కూటమి కార్యకర్తలు అందరు సమైక్యంగా కృషి చెయ్యాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు , జనసేన పార్టీ ఉండి నియోజకవర్గ ఇంచార్జి జుత్తుగ నాగరాజు, కొత్తపల్లి నాగరాజు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.
