సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం ఉండవల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు మీడియా సమావేసంలో మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని . ప్రజాస్వామ్యానికి ఎవరూ అతీతులు కాదని అన్నారు. ఈ 2న్నర ఏళ్ళ చక్కటి పాలన చూసి ప్రజలు కూటమి అభ్యర్థులకే మద్దతు పలుకుతారని ధీమా వ్యక్తం చేసారు. 2024 ఎన్నికల్లో ప్రజలు చరిత్ర సృష్టించారని తమ మూడు పార్టీల కూటమికి 94శాతం స్ట్రైక్ రేట్, 57శాతం ఓట్ షేర్ ఇచ్చారని తెలిపారు. వైసీపీ అరాచక పాలన, విధ్వంసంపై ప్రజలు తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్ఛోక ఏ ఒక్కరోజునూ తాము వృథా చేయలేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనపై దృష్టిపెట్టామని వెల్లడించారు. సూపర్ సిక్స్‌ను సూపర్ గా అమలు చేశామని ప్రతి వ్యక్తికి, కుటుంబానికి భద్రత కల్పించామని అన్నారు. వృద్ధులకు పెన్షన్ రూ.4 వేలు ఇచ్చి ఆర్థిక భద్రత కల్పించామని తెలిపారు. మెగా డీఎస్సీపై వైసీపీ ఎన్నో కుట్రలు చేసిందని ధ్వజమెత్తారు. డీఎస్సీ ద్వారా ఎంపికైన టీచర్లను జగన్ అండ్ కో ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడారని ఆగ్రహించారు. రాయలసీమలో ఎన్నో ప్రాజెక్టులు తీసుకువస్తున్నామని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *