సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు వద్ద నేడు, బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు నుంచి కావలికి వెళ్తున్న నాన్‌స్టాప్ ఆర్టీసీ బస్సు, ఎక్స్‌కవేటర్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లతో పాటు సుమారు 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో బస్సు డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. స్థానికులు తీవ్రంగా శ్రమించి డ్రైవర్‌ను బయటకు తీసుకొచ్చారు. పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
