సిగ్మా తెలుగు డాట్,ఇన్ న్యూస్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 25 ఏళ్ల నిరంతర ప్రజాసేవా ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా నేటి బుధవారం (సెప్టెంబర్17వ తేదీ) నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప అభియాన్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. ఈ చారిత్రాత్మక సందర్భంగా ప్రజలందరూ నేటి సాయంత్రం 7 గంటలకు తమ ఇళ్ల ముందు దీపాలు వెలిగించి, దేశ ప్రగతికి అహర్నిశలు శ్రమిస్తున్న ప్రధానమంత్రి మోడీని ఆశీర్వదించాలని ఆయన కోరారు. 13 ఏళ్ల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తదనంతరం దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు దేశానికి అందించిన విశేష సేవలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
