సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు,గురువారం ఏపీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో టీడీపీ కి చెందిన నందమూరి బాలకృష్ణ తో సహా 13 మంది ఎమ్మెల్యే లు రాష్ట్రము అప్పులు పాలయిందంటు నినాదనాలతో ప్లై కార్డ్స్ చేతబూని నిరసన తెలిపారు. తదుపరి అసెంబ్లీ లో ప్రతిపక్ష నేత అచ్చెమునాయుడు నేతృత్వంలో ప్రవేశించారు. సభలో తరచూ టీడీపీ సభ్యుల నిరసన ధ్వనుల మధ్యే మంత్రి బుగ్గన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై .. మీ హయంలో అంత అవినీతి చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు .. ఇప్పుడు అభివృద్ధి పధంలో నడుపుతుంటే ఓర్వలేకపోతున్నారు అంటూ ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని స్పీకర్‌ను సీఎం జగన్ కోరారు. టీడీపీ సభ్యులు ఎంత చెప్పినా వినకపోవడంతో స్పీకర్ సీరియస్ అయ్యారు. బడ్జెట్ ప్రవేశపెడుతుంటే అడ్డుకోవడం సరికాదన్నారు. తెలుగుదేశం సభ్యుల నినాదాలతో అసెంబ్లీ హోరెత్తింది. టీడీపీ ఉద్దేశపూర్వకంగానే అసెంబ్లీని అడ్డుకుంటున్నారని మంత్రి బుగ్గన అన్నారు. అసెంబ్లీ సంప్రదాయాలను పాటించాలన్నారు. చివరకు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తూ బుగ్గన తీర్మానం చేయగా.. అందుకు స్పీకర్ ఆమోదం తెలిపారు. సభ నుంచి 13 మంది సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తమను సస్పెండ్ చేయడంపై టీడీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *