సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సూపర్ స్టార్ మహేష్ బాబు తాజగా ఒక మీడియా ఛానెల్ ఇంటర్యూలో తన కెరీర్ ను మలుపు త్రిపిన 3సినిమాలను ప్రకటించారు. అవి ..నా కెరీర్ లో నన్ను ప్రభావితం చేసి, నా కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమాలు అంటే మురారి, పోకిరి, శ్రీమంతుడు.. ఈ చిత్రాలు నన్ను ఆడియన్స్ కి బాగా దగ్గర చేసాయి. ఆ సినిమాలు తనను బడా మాస్ హీరోని , క్లాస్ హీరోని చేయడమే కాకుండా కలెక్షన్స్ విషయంలో టాలీవుడ్ లో కొత్త రికార్డులను సృష్టించాయి అని పేర్కొన్నారు. మురారి, ఒక్కడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు సినిమాలు. ఈ 5 సినిమాలు తనకెరీర్ లో కీలక సమయాలలో విడుదలయ్యి రికార్డు కలెక్షన్స్ తో ఆదుకొన్నాయన్నారు. ఇక ఇన్నాళ్ల ప్రయాణంలో సినిమా విజయం పై నా ఆలోచనా సరళి కూడా మారింది. నా పాత్రలకు కాస్త గ్రే షేడ్స్, నెగిటివ్ ఛాయలు ఉన్నప్పటికీ ప్రేక్షకులు పాత్రలను అర్ధం చేసుకోవడంలో పరిణీతి పొందారు. సినిమాకి బాక్సాఫీస్‌ కలెక్షన్స్ అనేవి ఎంత ముఖ్యమో.. ఆ సినిమా ఆడియన్స్ పై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది కూడా అంతే ముఖ్యం. అది కూడా సినిమా విజయానికి కారణం అవుతుంది. ఒక పాత్రని నేను అంగీకరించిన తరువాత ఆ క్యారెక్టరైజేషన్‌కు లొంగిపోతాను. దర్శకుడు చెప్పిన విధంగా ఆ పాత్రని చేసుకుంటూ వెళ్తాను. ప్రస్తుతము రాజమౌళి సినిమా కోసం తన వంతు కృషిలో ఏ లోపం ఉండదని అభిమానులకు భరోసా ఇచ్చారు మహేష్ బాబు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *