సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో సీఎం జగన్.. పవన్ పేరు పెట్టకుండానే ఆయనను నుద్దేశించి మ్యారేజి స్టార్ .. కొత్త కారులు మార్చిన తీరున భార్యలను మార్చే.. దత్తపుత్రుడు అంటూ చేసిన విమర్శల నేపథ్యంలో.. ఇంకోసారి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే మేం మీ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడాల్సి వస్తుందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు (చినబాబు) అన్నారు. భీమవరంలో జనసేన పార్టీ నాయకులు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోవిందరావు మాట్లాడుతూ.. తల్లి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి చిన్నాన్న హత్య జరిగితే ఆ కేసు విషయాన్ని పట్టించుకోని జగన్ రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తాడను కోవడం పొరపాటు అన్నారు. సీఎం జగన్ సభ కోసం జేఎన్టీయూ పరీక్షను క్యాన్సిల్ చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ అసమర్థ విధానాలు కారణంగా గత ఏడాదికన్నా ఈ ఏడాది ఇంజనీరింగ్ విద్యార్థులు తగ్గారన్నారు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ గ్రాఫ్ తగ్గుతుందని, భీమవరం నుంచి వచ్చే ఎన్నికల్లో చరిత్రలో నిలిచిపోయి మెజార్టీని జనసేన టీడీపీ పొత్తుతో సాధిస్తామన్నారు. జగన్ పబ్లిసిటీ పిచ్చి కారణంగా . భీమవరంలో నిర్వహించిన సభకు పెట్టిన ఖర్చుతో జిల్లాలో డ్రైన్ల అభివృద్ధి చేయవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో పిఏసి సభ్యులు కనకరాజు సూరి, జిల్లా జనసేన కీలక నేతలు జుత్తిగ నాగరాజు, బొమ్మిడి నాయకర్, పి. ధర్మరాజు, చెనమల్ల చంద్రశేఖర్, రవీంద్ర, బండి రమేష్, నాయకులు మోకా శ్రీనివాస్, నీలేంద్ర తదితరులు పాల్గొన్నారు.
