సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చి మాసియాలో 6నెలలు పైగా యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తో భేటీ అయ్యారు. కిర్గిస్థాన్లో షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు సందర్భం గా ఇరువురు నేతలు ద్వై పాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో యుద్ధం ముగింపు కు హర్మూజ్ జలసంధి దిగ్బంధనం వంటి కీలక అంశాలపై చర్చించారు. గల్ఫ్ లో శాంతి నెలకొల్పే లక్ష్యంతో చేపట్టే అన్ని ప్రయత్నా లకు భారత్ మద్దతు ఉంటుందని మోదీ భరోసా ఇచ్చా రు. భవిష్యత్ లో ఇరుదేశాల మధ్య మరింత వాణిజ్య పరిధిని విస్తరించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ మాట్లాడుతూ.. తాము యుద్ధాన్ని కోరుకోవట్లేదన్నారు. ‘చర్చల ద్వారా సమస్య ను పరిష్క రించుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం . కానీ మాపై అమెరికా ఇజాయిల్ దురాక్రమణను మాత్రం సహించమని, తమ సైనిక బలంతో, దృఢ నిశ్చయంతో వారిని ప్రతిఘటిస్తాం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *