సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఆక్వా వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో పడిందని, ఎక్సపోర్టర్లు , పీడ్స్ అమ్మేవారు సిండికేట్లు అయ్యి తమను నిలువునా దోచేస్తున్నారని ఎన్ని ఉద్యమాలు చేసిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇస్తానన్న విద్యుత్తూ సబ్సిడీలు కూడా ఇవ్వడం లేదని గత నెల రోజులు పైగా తీవ్ర స్థాయిలో ఆక్వా రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళన ఉద్యమం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు, భీమవరం విద్యుత్తూ శాఖ ప్రధాన కార్యాలయం ముందు జిల్లా ఆక్వా రైతులు సంఘం ఆధ్వర్యంలో తమ నిరసనను వ్యక్తం చేసి అధికారులకు విన్నతి పత్రం అందజేశారు… జిల్లాలో ఆక్వా రైతుల పరిస్థితి బాగోలేదని రాష్ట్రంలోని ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం ఆక్వా జోన్, నాన్ జోన్ అంటూ లేకుండా చెరువుల విస్తీర్ణం తో సంబంధం లేకుండా ఆక్వా వ్యవసాయం చేస్తున్న ప్రతి రైతుల కు విద్యుత్తూ యూనిట్ కు రూపాయిన్నర కే సబ్సిడీ కి ఇస్తామని హామీ ఇచ్చారని కానీ 2 ఏళ్ళు దాటినా ఇప్పటి వరకు ఆ సబ్సిడీ ఇవ్వడం లేదని హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆక్వా వ్యవసాయం వదులుకోవడం మినహా తమకు మరో దారిలేదని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
