సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒకనాడు వైసీపీ పార్టీ లో అగ్ర నేతగా వెలిగిన మాజీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి ఆధ్వర్యంలో నేడు, బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. పరివర్తన రాజనీతి పార్టీ (PRP) పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు. పార్టీ జెండా మధ్యలో ధర్మచక్రం గుర్తు ఉంది. తెలుపు, కాషాయ రంగులో ఉండేలా పార్టీ జెండాను ఆయన రూపొందించారు. ఈ సందర్భంగా పరివర్తన రాజనీతి పార్టీ అధినేత విజయసాయి రెడ్డి ప్రసంగించారు. మార్పు అన్నది ప్రజలే తీసుకురావాలని ఆకాంక్షించారు. ఏపీ భవిష్యత్తు ఏ నాయకుడు చేతుల్లో లేదని.. ప్రజల చేతుల్లో ఉందని వ్యాఖ్యానించారు. ప్రజల అవసరాలు అధికార కూటమి కి , ప్రతిపక్ష వైసీపీ లకి కనబడటం లేదని తెలిపారు. తప్పు ఎవరు చేసిన ప్రశ్నించాల్సిందేనని అన్నారు. ప్రశ్నించడం ప్రజల హక్కు అని చెప్పారు. పీఆర్పీ అంటే మీలోని నాయకత్వ లక్షణాలను పైకి తీసుకురావడమే తమ పార్టీ లక్ష్యమని ఉద్ఘాటించారు. ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలను రెండు కుటుంబాలే శాసిస్తున్నాయని తెలిపారు. దీనిని అడ్డుకొనే లక్ష్యంతోనే కొత్త పార్టీ తో వచ్చానని విజయ సాయి రెడ్డి అన్నారు.
