సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నిన్నటి తో పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం పూర్తీ అయ్యింది. అవలీలగా కూటమి అభ్యర్థులు జిల్లా జడ్పీ చైర్మెన్ స్థానాన్ని కైవసం? చేసుకొంటామని ఆశాభావంతో ఉన్నారు. అయితే ‘ట్విస్ట్’ ఏమిటంటే.. కీలకమైన ‘ జిల్లా పరిషత్ చైర్మన్ ‘ అభ్యర్థిత్వానికి జనరల్ కేటగిరిలో ఇద్దరు నేతలు రఘురామా కృష్ణంరాజు ఎమ్మెల్యే గా ఉన్న ‘ఉండి’ నుండే పోటీపడుతూ తమ నామినేషన్‌లు దాఖలు చేశారు. చైర్మన్‌గా ఎన్నిక కంటే ముందు జడ్పీటీసీగా గెలుపొందవల్సి ఉంటుంది. ఎన్నికైన జడ్పీటీసీలు చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ఉండి జడ్పీటీసీ స్థానం నుండి తెలుగుదేశం నుంచి పొత్తూరి రామరాజు, జనసేన నుంచి పీవీఎల్ నరసింహరాజులు( ఇటీవల వైసీపీ నుండి జనసేన లో చేరారు) ఇద్దరు నామినేషన్ వేయడం జరిగింది. నిజానికి ఉండి జడ్పీటీసీ స్థానాన్ని తెలుగుదేశానికి కేటాయించారు. నామినేషన్ ఉపసంహరణ సమయానికి ముందే వీరిలో ఒకరు తగ్గవలసి ఉంది. వారిలో ఒకరే బరిలో ఉండేలా కూటమిలో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఒకవేళ తగ్గకపోతే మాత్రం..
