సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో పయనించాయి..మార్కెట్ రికవరీలో ఐటీ (IT) రంగ షేర్లు అద్భుతమైన పనితీరు కనబరిచాయి ట్రేడింగ్ ముగిసే సమయానికి ముంబై స్టాక్ మార్కెట్ సూచీ బీఎస్‌ఈ సెన్సెక్స్ ఏకంగా 1,109.10 పాయింట్లు (1.54%) లాభపడి 73,033.78 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ మార్కెట్ సూచీ నిఫ్టీ 50 358.60 పాయింట్లు (1.60%) జంప్ చేసి 22,721.95 పాయింట్ల వద్ద ముగిసింది.సెన్సెక్స్ ఇవాళ 1,100 పాయింట్లకు పైగా ఎగబాకగా, ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గణనీయంగా పెరిగి, ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజే దాదాపు రూ.4 లక్షల కోట్లు పెరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *