సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణితోపాటు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తాయనిపలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. అక్టోబర్14 నుంచి 16వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా కోనసీమ, కృష్ణా జిల్లాల్లో ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. 16వ తేదీన అల్లూరి, పోలవరం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొన్నారు
