సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రధాని మోడీ హావ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ హడావిడిలో దేశాన్ని ఒక ఊపు ఊపిన మాట నిజం.. అయితే ఆమ్ అండ్ ఆద్మీ నేత ఢిల్లీ సీఎం క్రేజీ వాల్ అరెస్ట్ తదుపరి పరిణామాల నేపథ్యంలో..అసలు తప్పు చెయ్యకుండా దేశంలో నిలబడే రాజకీయ పార్టీ ఎవరైనా ఉన్నారా? బీజేపీ అసలు తప్పులే చెయ్యలేదా? దేశ యువత, సామాన్యులు ప్రశ్నించుకోవడం.. శ్రీ రాముడి అయోధ్యగుడితో పాటు పెట్రోల్ తో సహా దారుణంగా పెరిగిన ధరలు ఫై మధ్యతరగతి వర్గం ప్రజలు చర్చ మొదలయింది. అవకాశ వాద రాజకీయాలుకే ‘ఆదిగురువు’ అయిన కాంగ్రెస్ నేతృత్వం లోని ఇండియా కూటమి కూడా రైతులకు రుణమాపీ పధకం కూడా ఎన్నికలలో బ్రహ్మస్త్రం లా పనిచేసిందని ఇప్పటి వరకు జరిగిన 6 దశల పోలింగ్ పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక జూన్ 1వ తేదీన 7వ విడుత పోలింగ్ తో ఎన్నికల అంకం ముగుస్తుంది. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు కానీ ఎదో తేడాగా ఉందే ? అంటూ ఎన్డీయే కూటమిలో అగ్ర నేతలలో కూడా మనోవ్యధ ప్రారంభమైనట్లు వారి తాజా వ్యాఖ్యానాలతో అవగతం అవుతుంది. ఒకవేళ 250 దగ్గర ఆగిపోతే మరో 20 స్థానాలకు ఎవరిని సంప్రదించాలి అన్నది కూడా ఇప్పుడే ప్యూహం సిద్ధం చేసుకొంటునట్లు వార్త కధనాలు వస్తున్నాయి.ఇప్పుడు 400 స్థానాలు మాట దేవుడు ఎరుగు .. 300 స్థానాలకు గెలిస్తే అదే పదివేలు ఇనుకొంటున్నారు. ఓటరు ఎప్పుడు తెలివైనవాడు .. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొంటాడు ఎవరిని ఎంత వరకు పెంచాలో తెలుసు..అది భారత ప్రజా స్వామ్య విజయ రహస్యం. అమృత్‌సర్‌లో నేడు, మంగళవారంనాడు జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ అడ్జక్షుడు ఖర్గే మాట్లాడుతూ, ఈ ఎన్నికలలో కాంగ్రెస్, ‘ఇండియా’ కూటమి లబ్ది పొందుతుందని చెప్పారు. ఎన్డీయే వాళ్ళు 400 సీట్లు మాట మరిచిపోండి. అదంతా నాన్సెన్స్. మీరు కనీసం ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయలేరు. మీకు 200 సీట్లకు మించి రావు” అని ఖర్గే ధీమాగా ప్రకటించారు. ఎక్కడి నుండి వచ్చింది ఈ ధీమా .. జూన్ 4న తేలుతుంది.
