సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గత తొమ్మిదేళ్ల సినిమా అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీలను నియమించి, వాటి చైర్మన్లు, మెంబర్ల పేర్లను కూడా ప్రకటించింది. వచ్చే నెల డిసెంబర్ నెలలోనే నంది అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ అవార్డుల ఎంపిక బాధ్యతను ప్రభుత్వం కమిటీలకు అప్పగించింది. అందులో అత్యంత కీలకమైన జాతీయ చలన చిత్ర అవార్డుల ఎంపిక కమిటీలకు ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. అంటే 2017 నుంచి 2024 వరకు 8 ఏళ్ల అవార్డుల ఎంపిక కమిటీకి బాలకృష్ణ చైర్మన్‌గా వ్యహరిస్తారు. ఈ కమిటీలో వరప్రసాద్ రెడ్డి, ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్, కైకాల నాగేశ్వరరావు సభ్యులుగా ఉంటారు. అదే విధంగా 2025 సంవత్సరపు జాతీయ చలనచిత్ర అవార్డుల ఎంపిక కమిటీకి కూడా బాలకృష్ణనే ఛైర్మన్‌ , అయితే ఈ కమిటీలో అల్లు అరవింద్, ఎస్. గోపాల్ రెడ్డి, సీనియర్ నటి ప్రభ సభ్యులుగా ఉన్నారు.అలాగే నంది చలనచిత్ర అవార్డులకు, టీవీ, నాటక రంగాలకు ప్రత్యేక కమిటీలను నియమించడం జరిగింది. ఇక 2017-2024 మధ్యలో వచ్చిన సినిమాల్లో ఏడాదికి మూడు చిత్రాలను ఎంపిక చేయనున్నట్టు తెలుస్తుంది. వాటికి ప్రధమ, ద్వితీయ, తృతీయ అవార్డులు ఇవ్వబోతోంది. అలాగే సంవత్సరానికి రెండు స్పెషల్ జ్యూరీ అవార్డులను కూడా ప్రకటించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *