సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ 2వ విడుత మున్సిపల్ ఎన్నికలు–2026 సందర్భంగా డీఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, భీమవరం ఎన్‌ఎస్‌ఎస్ విభాగానికి చెందిన సుమారు 80 మంది వాలంటీర్లు నేడు, గురువారం స్థానిక ఎన్నికల విధుల్లో పాల్గొని విశేష సేవలందించారు.ఎన్నికల సందర్భంగా వృద్ధులకు ఓటు వేయడానికి సహాయపడటం, పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు అవసరమైన సమాచారం అందించడం, ఓటర్లకు మార్గనిర్దేశం చేయడం వంటి సేవా కార్యక్రమాల్లో వాలంటీర్లు చురుకుగా పాల్గొన్నారు. ప్రజాస్వామ్య పండుగలో యువత బాధ్యతాయుతంగా భాగస్వాములు కావడం అభినందనీయమని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీ గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు), ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ల సేవలను ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *