సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఇక పోరు బాట పడుతున్నారు. దీనికి సెప్టెంబరు 5వ తేదీ డెడ్‌లైన్‌ అని ఏపీ జేఏసీ అల్టిమేటం జారీ చేసింది. పీఆర్సీ కమిషన్‌ ఏర్పాటు, డీఏల బకాయిలు, సరెండర్‌ లీవుల చెల్లింపు తదితర సమస్యల పరిష్కారం కోసం రేపు శనివారం (సెప్టెంబరు 5న) రాష్ట్రకార్యవర్గ సమావేశం విజయవాడలో నిర్వహిస్తున్నట్లు దీనికి పశ్చిమ గోదావరి జిల్లా ఉద్యోగుల సంఘాలు నేతలు అంతా విశేషంగా తరలి వెళుతున్నారు. ఉద్యోగుల సంఘాలు వారితో కూటమి ప్రభుత్వ చర్చలు విఫలమైతేనే ఈసారి ఉద్యమ బాట పట్టడం అనివార్య మవుతుందని స్పష్టం చేశారు. పీఆర్సీ, పెండింగ్‌ డీఏలు తీరుస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో పేర్కొందన్నారు. కూటమి ప్రభుత్వం ఒక డీఏ మాత్రమే ఇచ్చిందని, ఇంకా ఐదు డీఏలు బకాయిలు ఉన్నాయన్నారు. జీతాలు అనుకొన్న తేదికి నెలవారీ సక్రమంగా చెల్లింపులు జరగటం లేదని ఇతర ఆర్థిక బకాయిల చెల్లింపుల్లో తీవ్ర ఇబ్బందులు పెడ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఎన్నికల హామీలో పేర్కొనట్లు ఇప్పటికి హెల్త్‌ కార్డు లు కూడా ఇవ్వడటంలేదని వాపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *