సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు లో కట్టుకున్న భార్యపై భర్త కత్తి తో విచక్షణారహితంగా దాడి చేశాడు.దానితో ఆమె తీవ్ర కత్తి పోట్ల గాయాలు పాలయి కొనప్రాణంతో విషమపరిస్థితులలో ఉంది. తుణుకు పాతవూరు ఇరగవరం కాలనీలో ఈ ఘటన జరిగింది. దుర్గప్రసాద్ అనే వ్యక్తి భార్య భవానితో కలిసి ఇరగవరం కాలనీలో నివాసం ఉంటున్నాడు. విహహం అయినప్పటి నుంచీ భార్య ప్రవర్తనపై పై అనుమానం పడుతూ .. ఆమెతో తరచూ గొడవలు పడుతూ ఉండేవాడని ప్రాధమిక సమాచారం. గత రాత్రి కూడా ఇరువురి మధ్య ఘర్షణ అదుపు తప్పి. తీవ్ర ఆగ్రహంతో భర్త దుర్గప్రసాద్.. భార్యపై అతికిరాతకంగా దాడి చేశాడు.దీంతో భవాని తీవ్ర గాయాలపాలైంది. స్థానికులు వెంటనే ఆమెను తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భవానిని పరీక్షించిన వైద్యులు.. పరిస్థితి అత్యంత విషమంగా ఉందని చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రిలో భవానికి చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *