సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ లో నేడు, ఆదివారం ఓటర్లు తమ ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు పోలింగ్ కేంద్రాల బాట పట్టారు. పలు ప్రాంతాలలో ముఖ్యంగా పులివెందుల రాయలసీమ గుంటూరు జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.పలు చోట్ల రాళ్ల దాడులు హింస, ఓటర్లు బదులు ఓటింగ్ ఏజెంట్స్ ఓట్లు వేస్తున్నారని వార్తలు ఆందోళలన కల్గిస్తున్నాయి. అయితే కోస్త ఆంధ్ర లో మాత్రం ఓటింగ్ కాస్త ప్రశాంతంగానే జరుగుతున్నట్లు సమాచారం. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఏదిఏమైనా సాయంత్రానికి 70 శాతం పైగా ఓటింగ్ జరగటం ఖాయం గా పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 92 మునిసిపల్ స్థానిక సంస్థల పరిధిలో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 10,262 మంది పోటీలో ఉండగా.. 11,705 పోలింగ్ కేంద్రాల్లో సుమారు కోటి మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కొంటున్నారు. అయితే.. నామినేషన్ ఇతరులు ఎవరు వేయకపోవడంతో (వెయ్యనీయకపోవడం ?) తొలి విడతలో 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా వాటిలో ప్రస్తుతానికి 17 చైర్‌పర్సన్ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి.ఇవన్నీ కూటమి ఖాతాలో పడ్డాయి ( అయితే 19 మునిసిపల్ ప్రాంతాలలో కూటమి వారు తమ నామినేషన్స్ చింపేశారని వైసీపీ అభ్యర్థులు వేసిన కేసులు ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతుంది) వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలోనే 6 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్‌పర్సన్ పదవులు ఏకగ్రీవం కావడంలో కూటమి సఫలం అయ్యింది.
