సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్ అర్నబ్ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 23 కి. మీ. వేగంతో కదులుతుందని ఇది తుపానుగా మారుతుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అర్నబ్ తుఫాన్ ప్రజలకు మిగిల్చిన కష్టాలు నుండి ఇంకా కోలుకొని కోస్తా ఆంధ్ర ప్రజలకు ముఖ్యముగా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు ఆందోళన కలిగించేలా ఈసారి మురసు తుఫాన్ దూసుకోస్తోంది. నేడు, సోమవారం సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ తుఫాన్ రేపు మంగళవారం ఉదయం నెల్లూరు, నరసాపురం మధ్య తీరం దాటుతుందనే అంచనాలు ఉన్నాయి.. అయితే మొన్నటి అర్నబ్ తుపాను స్థాయిలో తీవ్రత ఉండకపోవచ్చు. ఈ తుఫాన్ ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *