సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎనికల్లో భాగంగా ఇప్పటికే మునిసిపల్, జడ్పీటీసీ పరిధిలో ఎన్నికలు నిర్వహించారు. ఇప్పుడు 2వ విడుత మునిసిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రేపు, ఎల్లుండి లోపు విడుదల కానుంది. ఈ నెల 25 వ తేదీ లోగ ఈ ఎన్నికల తతంగం పూర్తీ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈనెల(నవంబరు) 13వ తేదీన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తారని సమాచారం. .ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్లె పోరుకు రంగం సిద్ధమైంది. మొత్తం మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 13 వేల 219 పంచాయతీలకు ఎన్నికలను ఎస్‌ఈసీ నిర్వహించనుంది. ఈ నెల 26, 29వ తేదీల్లో, డిసెంబర్ 2వ తేదీన పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 13వ తేదీన మొదటి దశకు నోటిఫికేషన్, రెండోదశకు 16వ తేదీన, మూడోదశకు 19వ తేదీన నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
