సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ఓటర్ల జాబితాకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ గడువును జులై 24వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి ఈ గడువు నేటితో (జులై 14) ముగియాల్సి ఉంది. అయితే, క్షేత్రస్థాయిలో ఓటర్లు గుర్తింపు స్వర్వే, పారమ్స్ ఓటర్లు చాల మంది పూర్తీ చేసి ఇంకా తిరిగి ఇవ్వని కారణంగా గడువును పెంచాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చేసిన విజ్ఞప్తికి ఈసీఐ సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు ఈనెల 24 వరకు ఇంటింటి సర్వే కొనసాగుతుందని తెలిపింది. 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ఈసీఐ విడుదల చేయనుంది. ఆగస్టు 30 వరకు అభ్యంతరాలను స్వీకరించి.. అక్టోబరు 3న ఓటర్ల తుది జాబితాను వెల్లడించనుంది
