సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సినీ హీరో ఘట్టమనేని జయకృష్ణ నేడు మంగళవారం భీమవరంలో సందడి చేశారు. ఆయన తొలిసారి హీరోగా నటించిన శ్రీనివాస మంగాపురం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి ఎడ్వర్ట్ ట్యాంక్ దగ్గర సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి తన తాతగారికి నివాళులర్పించారు. జయకృష్ణ రాకతో భీమవరంలో కృష్ణ, మహేష్ బాబు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముందుగా కృష్ణ ప్యాన్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు రాయప్రోలు శ్రీనివాస మూర్తి నివాసం నుంచి శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి ఆలయం వరకు అభిమానులతో బైక్ ర్యాలీ చేపట్టారు. మావుళ్ళమ్మ అమ్మవారి దర్శించుకొన్నారు. . అనంతరం త్యాగరాజ భవనంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అభిమానుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కృష్ణ, మహేష్ బాబు, రమేష్ బాబు అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు, ఆశీస్సులు ఎప్పటికీ మరిచిపోనని, మరల భీమవరం విజయతోత్సవానికి వస్తానని అన్నారు. రాయప్రోలు శ్రీనివాస మూర్తి, బిహెచ్ సుబ్బరాజు మాట్లాడుతూ.. కృష్ణ వారి కుటుంబం నుంచి వస్తున్న మరొక గొప్ప నటులు జయ కృష్ణ అని, ఈనెల 30న విడుదల కాబోతున్న శ్రీనివాస మంగాపురం చిత్రం గొప్ప విజయం సాధిస్తుందని అన్నారు. ఈ . కార్యక్రమంలో సీనియర్ కృష్ణ అభిమాని, రాష్ట్ర క్షత్రియ కార్పోరేషన్ చైర్మన్ వేగేశ్న కనకరాజు సూరి, గంట్ల ప్రసాద్, బోణం వరప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
