సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం విజయవాడ లో ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను మంత్రి బొత్స సత్య నారాయణ విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో 1,71,514 మంది (76.32 శాతం ), అగ్రికల్చర్లో 81,203 మంది (89.65 శాతం ) ప్రవేశాలకు అర్హత సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో.. ఉమేశ్ వరుణ్ (నందిగామ) మొదటి స్థానంలో నిలవగా.. అభినవ్ చౌదరి(హైదరాబాద్) రెండో స్థానంలో, సాయిదుర్గారెడ్డి (పిడుగురాళ్ల) మూడో ర్యాంకు, బాబు సుజన్రెడ్డి (తిరుపతి) నాలుగో ర్యాంకు, వెంకట యుగేశ్ (రాజం పేట) ఐదో స్థానం దక్కిం చుకున్నారు.. ఇక అగ్రికల్చ ర్లో.. సత్య రాజ జశ్వంత్ (కాతేరు) మొదటి ర్యాంకు సాధించగా.. వరుణ్ చక్రవర్తి (శ్రీకాకుళం ) రెండో ర్యాంకు, రాజ్ కుమార్ (సికిం ద్రాబాద్) మూడో ర్యాంకు, సాయి అభినవ్ (చిత్తూరు) నాలుగో ర్యాంకు, కార్తికేయరెడ్డి(తెనాలి)కి ఐదో ర్యాంకు సాధించారు.
