సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈనెల 13వ తేదీ రాత్రి ఏలూరు నగరంలో యాసిడ్ దాడిలో గాయపడిన మహిళ గత రాత్రి మృతి చెందింది. విజయవాడ మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఎడ్ల ఫ్రాన్సినా మృతి చెందింది. నిన్న ఆమె పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందించారు. గత రాత్రి ఫ్రాన్సినా మృతి చెందింది. ఈ నెల 13వ తేదీ రాత్రి డెంటల్ హాస్పటల్ లో పని ముగించుకొని స్కూటీపై వస్తున్న ఫ్రాన్సినాపై కొందరు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఆమెకు మొదట ఏలూరు ఆసుపత్రిలోనూ, తరువాత విజయవాడ ఆసుపత్రిలోనూ ఉంచి చికిత్సను అందిస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం విజయవాడ మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రధాన నిందితుడు బోడ నాగ సతీష్ తో బాధితురాలి సోదరి సౌజన్యతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలోనే తమకు అడ్డుగా ఉందనే కోపంతో ఫ్రాన్సినాపై నిందితుడు నాగ సతీష్ పాశవికంగా యాసిడ్ దాడి చేయించాడు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. మానవత్వానికే మచ్చ తెచ్చేలా వ్యవహరించిన నిందితులకు కఠిన శిక్ష పడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
